కరోనా సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు డిమాండ్ పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ రంగానికి అలవాటుపడ్డారు. మరోవైపు థియేటర్స్ కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో నిర్మాతలు ఓటీటీలలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇక వినాయక చవితి సందర్భంగా ఈ వారం చాలా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆ లిస్ట్ చూసుకుంటే…ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో టక్ జగదీష్ సెప్టెంబర్ 10 నుంచి స్ట్రీమ్ కాబోతుంది. ముంబై డైరీస్ 26/11 సెప్టెంబరు 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.లూలా రిచ్ సెప్టెంబర్ 10 విడుదల అవుతుంది.
ఇక విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న తుగ్లక్ దర్బార్’. సెప్టెంబరు 11 నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అలాగే అన్‌టోల్డ్: బ్రేకింగ్ పాయింట్ సెప్టెంబర్ 10 విడుదల అవుతుంది. ఇన్ టు ది నైట్ సెప్టెంబర్ 8 విడుదల అవుతుంది. బ్లడ్ బ్రదర్స్ సెప్టెంబర్ 9 విడుదల అవుతుంది. మెటల్ షాప్ మాస్టర్స్ సెప్టెంబర్ 10 విడుదల అవుతుంది.
అలాగే ఆహా లో ద బేకర్ అండ్ ద బ్యూటీ సెప్టెంబర్ 10 విడుదల అవుతుంది. మహాగణేశా సెప్టెంబర్ 10 విడుదల అవుతుంది.మరోవైపు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అమెరికన్ క్రైమ్‌స్టోరీ సెప్టెంబర్ 8న విడుదల అవుతుంది.