తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు సంక్రాతి సెలవులను ప్రకటించాయి. తెలంగాణలో ఈ నెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 18న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నట్టు తెలిపింది.
అదేవిధంగా కళాశాలలకు జనవరి 13 నుంచి 15 వరకు సెలవులను ప్రకటింది. 16న కళశాలల్లో తరగతులు పున: ప్రారంభమవుతాయని వెల్లడించింది.
ఇదిలా ఉంటే అటు ఏపీ సర్కార్ కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 16 వరకు పాఠశాలలకు సెలవులుగా ప్రకటించింది.
ఈ మేరకు అకాడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 18న పాఠశాలలు, కళశాలలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది.