చాలా వరకు సినిమాలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. కొబ్బరికాయ కొట్టడం మాత్రమే వాళ్ల చేతిలో ఉంటుంది అది గుమ్మడికాయ కొట్టే వరకు వెళ్తుందా లేదా అనేది చాలా మందికి తెలీదు. ఆ విధంగా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఆ విధంగా చిన్న హీరోల సినిమాలే కాదు స్టార్ హీరోల సినిమాలు సైతం ఆగిపోయాయి. కారణం ఏది అవని అలా ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. మొదటిగా పెద్ద సినిమాల విషయం గురించి మాట్లాడుకుంటే…. వినాలని మెగాస్టార్ చిరంజీవి హీరో రామ్ గోపాల్ దర్శకత్వంలో దీనిని ఎనౌన్స్ చేశారు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ స్టార్ డైరెక్టర్, చిరు పెద్ద హీరో అలాంటిది వారి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అనుకోకుండా ఆ చిత్రం మధ్యలో ఆగిపోయింది. షూటింగ్ కూడా కొన్ని రోజులు చేశారు. కానీ ఉన్నట్టుండి మొత్తం ఆపేసారు. ఈ సినిమా ఆగి పోవడానికి గల కారణాలు కూడా ఇద్దరూ ఎక్కడా చెప్పలేదు. ఆ తర్వాత వర్మ బాలీవుడ్ లో ఆఫర్లు ఉండటం వల్ల వదిలేసా అంటూ చెప్పుకొచ్చారు.
అబు… సురేష్ కృష్ణ దర్శకత్వంలో 90వ దశకంలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇండియన్ టెక్నీషియన్స్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేసిన తొలి భారతీయ చిత్రం ఈ చిత్రం. పాన్ ఇండియా లెవెల్ లో 50 కోట్లు ఖర్చుపెట్టి ఈ సినిమాని ప్లాన్ చేశారు. చిరంజీవి గెటప్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. కానీ కొంతమంది ముస్లిం నేతల ఒత్తిడి కారణంగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఇక మూడవ సినిమా విక్రమ్ సింహ భూపతి…20 సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఎస్ గోపాల్ రెడ్డి అప్పట్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. హీరోయిన్స్ గా రోజా, అంజలి జవేరి నటించగా భారీ సెట్టింగ్స్ వేసి ఈ సినిమాని నిర్మించారు. కానీ బాలయ్యకు కోడి రామకృష్ణకు మధ్య విభేదాలు రావడంతో కోడి రామకృష్ణ ను తీసేస్తే సినిమా చేస్తానని లేదంటే చేయనని చెప్పాడట. దీంతో అలా సినిమా మధ్యలో ఆగిపోయింది. తర్వాత నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి మరణించారు.
చిరు చేస్తానన్న సినిమాను వెంకీ చేశాడట!! చివరికి పోలీసు కేసు కూడా
మరో సినిమా నర్తనశాల… నందమూరి తారక రామారావు నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నర్తనశాల ఒకటి. 1963లో వచ్చిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నవరసాలు నిండిన ఈ సినిమా అంటే ఎంతో బాలయ్య కు కూడా ఇష్టం. అందుకే ఇప్పటి జనరేషన్ కు తెలియజేసేందుకు ఈ సినిమాను సొంత దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నారు. 2004లో మార్చి 1న ఈ సినిమాను ప్రారంభించారు. సౌందర్య, శరత్ బాబు, శ్రీహరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే సౌందర్య దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించడంతో ఈ సినిమా ఆగిపోయింది.
మరో సినిమా రాధా… వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. ఈ సినిమాకు రాధా అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. దానయ్య ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అలాగే నయనతార హీరోయిన్ గా నటించబోతుందని కూడా ఫిక్స్ చేశారు. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది. అదే టైటిల్ తో శర్వానంద్ కామెడీ సినిమాని తీశాడు.
చిరంజీవి ఆ అక్షరంతో తీసిన అన్ని సినిమాలు ఫ్లాప్ సినిమాలేనట!! అలా ఎన్ని ఉన్నాయంటే?
అలాగే ఆటా నాదే… వేట నాదే వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ అదే సమయానికి బాలకృష్ణ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా కు దర్శకత్వం వహించే ఛాన్స్ తేజ కు వచ్చింది. దీంతో ఆయన సినిమా మధ్యలో ఆగిపోయింది. అలాగే నాగార్జున మహేష్ బాబు మణిరత్నం కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ వార్త విన్న అక్కినేని ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఇది సెట్స్ పైకి వెళ్ల లేదు.
మరో చిత్రం నాగార్జున, ధనుష్ ల చిత్రం. ధనుష్ దర్శకత్వంలో నాన్ రుద్రన్ అనే ఒక మల్టీ స్టారర్ సినిమా స్టార్ట్ అయింది. షూటింగ్ కూడా మొదలైంది. ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. కానీ ఈ సినిమాను మధ్యలో ఆపేసాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి… 2003లో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీగా ఓపెనింగ్ కూడా చేశారు. దాసరి క్లాప్ కొట్టగా వెంకటేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. కానీ ఈ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లలేదు.
భారీ గ్రాఫిక్స్ తో అంచనాలతో విడుదలైన “దేవి పుత్రుడు” పరాజయానికి కారణాలు అవేనా ?
జీసస్ క్రైస్ట్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయాలని అనుకున్నాడు. టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. సినిమా షూటింగ్ కోసం ఇజ్రాయిల్ కూడా అప్పట్లో వెళ్లారు. కానీ మధ్యలోనే ఆగిపోయింది. ఇలా చాలా సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయాయి.