ప్రతి ఏటా మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాము. ఇది భారత దేశంలోని ప్రజలకు ఎంతో విశిష్టమైన రోజు. ఎందుకంటే.. ఆ రోజు చదువుల తల్లి సరస్వతి దేవిని ప్రతిఒక్కరు భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, గురువులు. అంతేకాదు వసంత పంచమి రోజు నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది.
ఈ వసంత పంచమినాడే చదువుల తల్లి సరస్వతి జయంతి అవడంతో ఈ పండుగ మరింత విశిష్టతను సంతరించుకుంది. అందుకే ఆ రోజున చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా పుస్తకాలను, కలాలను సరస్వతి దేవి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. చాలా మంది తల్లిదండ్రులు పంచమి రోజున తమ పిల్లలకు సరస్వతీ మాతా దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తుంటారు.
ఎందుకంటే.. అమ్మవారి దగ్గర అక్షరాభ్యసం చేయించడం వల్ల పిల్లలు జ్ఞానరాశులు అవుతారని వారి నమ్మకం. శనివారం వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వసంత పంచమిని పురస్కరించుకుని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం బాసరలో ఆలయంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఒకరోజు ముందు నుండే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. దాంతో ఆలయం మొత్తంలో సందడి వావతావరణం నెలకొంది.