హైదరాబాద్ లోని ఓ హోటల్ బిర్యానిలో బల్లి ప్రత్యక్షమైంది. దీంతో వినియోగదారుడు షాక్ అయ్యాడు. దీంతో హోటల్ యాజమాన్యంపై అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఘటన వివరాల్లోకి వెళితే… రాం నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవి చారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓ హోటల్ లో బిర్యానీ కొన్నాడు. దాన్ని ఇంటికి తీసుకువెళ్లి తిందాం అనుకున్నాడు.
కాళ్ళు చేతులు కడుక్కుని బిర్యానీ తిందాం అని రెడీ అయ్యాడు. బిర్యాని ప్యాకెట్ ఓపెన్ సగం వరకు తిన్నాడు. ఈ క్రమంలో అతనికి బిర్యానీలో బల్లి కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో బిర్యానీ ని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్ కు పోలీసులు పంపించారు. బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని ఫుడ్ సేఫ్టి అధికారులు తనిఖీలు నిర్వహించారు.