రుణ యాప్ ల బాధలు తాళలేక నిత్యం ఎక్కడో చోట మరణ మృదంగాలు మోగుతూనే ఉంటున్నాయి. తాజాగా రుణ యాప్ ల ద్వారా రుణం పొందిన వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా వేధింపులు ఆపకపోవడంతో ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానికి చెందిన బండపల్లి ప్రత్యూష అనే యువతి కొద్ది రోజుల క్రితం రుణ యాప్ ల ద్వారా రుణాన్ని పొందింది. ఇండియన్ బుల్స్, రూపి ఎక్స్ ఎమ్ రుణ యాప్ లో 20 వేలు లోన్ తీసుకోగా ఇంకా 8 వేలు బాకీ ఉంది. రెండు రోజుల నుంచి ఆమెకు రుణ యాప్ సెంటర్ల నుంచి సిబ్బంది ఫోన్ చేసి వేధిస్తున్నారు.
నగ్న చిత్రాలను నీ స్నేహితులకు, బంధువులకు పంపుతామని బెదిరించారు. దీంతో తీవ్ర మానసిక వేధనకు గురైన ఆమె తన ఇంటి పైనున్న ఐరన్ ఫ్రేమ్‌కు చీరతో ఉరేసుకుని చనిపోయింది. ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియోను తన తల్లిదండ్రులకు, భర్తకు పంపింది.
ఆమె ఆత్మహత్య కు పాల్పడిన ఉదయం నుంచి ఆమె మొబైల్ కు , వాట్సాప్ కు ఆగకుండా కాల్స్ వస్తునే ఉన్నాయి. ఆమె వాట్సాప్ కాంటాక్ట్స్ కు ఆమెను అసభ్యంగా కించపరుస్తూ సందేశాలు పంపిన రుణ యాప్ నిర్వాహకులు.
దీంతో ఆగకుండా 9745211357 సెల్ నెంబర్ నుండి ఆగని వేధింపులు. కాల్స్ వస్తుండటంతో తీసిన భర్త రాజశేఖర్ కు వీరబాబుయడ్ల@వైబిఎల్ లింక్ ద్వారా బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆమె భర్త రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆయన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.