హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ లో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సికింద్రాబాద్-కర్నూలు మధ్య నడిచే హంద్రీ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ స్టేషన్ ల నిలిచివుండగా…ఫలక్ నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఎం.ఎం.టి.ఎస్ లోకల్ ట్రెయిన్ అదే ట్రాక్ పై వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో పట్టాలు తప్పాయి. ఎంఎంటిఎస్ ట్రెయిన్ డ్రైవర్ శేఖర్ క్యాబిన్ లో చిక్కుకుపోయారు. అతి కష్టం మీద అతన్ని బయటకు తీశారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పరిశీలించారు.