కచ్చులూరు బోటు ప్రమాదానికి కారణం బోటు నడిపిన వారే అయినా… శివుని ఆగ్రహాంతోనే అక్కడ ప్రమాదాలు అంటున్నారు స్థానిక గిరిజన జనం. గోదావరి నది ప్రవహించే కచ్చులూరు సమీపంలో ఉన్న కొండల్లో మహశివుని ఆలయ ఉంది, అక్కడవకు విహారయాత్రకు వచ్చే వారంతా… శివుణ్ణి దర్శించుకొని వెళ్తారు. అయితే, టూరిస్టులంతా మద్యం సీసాలతో వస్తుంటారు. అది శివాగ్రహానికి కారణం అవుతోందని స్థానిక గిరిజనం నమ్మకం. పైగా తరచూ జరుగుతోన్న గోదావరి ప్రమాదాలు అమావాస్య, పున్నమి సమయాల్లోనూ జరుగుతాయని… గతంలో జరిగిన ప్రమాదాలు ఇలాగే జరిగాయని అంటున్నారు. ప్రమాదం జరిగిన ఒడ్డున శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.
ప్రమాదం జరిగి ఇప్పటికి 36 రోజులు గడుస్తున్నా బోటు వెలికితీత పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 41 మంది మృతి చెందగా ఇంకా 15 మృతదేహాలు లభ్యం కాలేదు.