ఎల్జీ పాలీమర్స్ వద్ద ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామస్తు ఆందోళన చేపట్టారు. దీనితో రోడ్డుపై పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగిన స్థానికుల చుట్టూ పోలీసులు మోహరించారు. పలువురి అరెస్ట్ కూడా చేశారు. కంపెనీతో ప్రభుత్వం కుమ్మక్తై తమ ప్రాణాలతో చె లగాటమాడుతున్నారని ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెను విషాధానికి కారణమైన పరిశ్రమను వెంటనే అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు రక్షణ ఏమిటని ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసే క్రమంలో గ్రామస్థులు ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.