రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక పై పోలీసు కానిస్టేబుల్ అత్యాచార యత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… శంకర్ పల్లి మండల కేంద్రం లోని గణేష్ నగర్ కాలనీలో వడ్డే శేఖర్ నివాసం ఉంటున్నాడు. అయితే వృత్తి రీత్యా కూకట్ పల్లి పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.
కాగా గణేష్ నగర్ కాలనీలోని మైనర్ బాలిక ను పని ఉందని పిలిచి అత్యాచారయత్నం చేయబోయాడు శేఖర్. బాలిక గట్టిగా కేకలు వేయడం తో అరుపులు విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్లి చూడగా బాలిక జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పింది. దీంతో స్థానికులు ఆగ్రహించి అతనిని పట్టుకొని దేహ శుద్ధి చేసి శంకరపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.