లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందని ప్రకటించినప్పటికీ, కొత్త నిబంధనలతో లాక్ డౌన్ ఉంటుందని ఇప్పటికే కేంద్రం ప్రకటన చేసింది. అయితే.. రెడ్, ఆరెంజ్ జోన్లలో అనేక మినహాయింపులు ఉంటాయని, లాక్ డౌన్ మరింత కఠినంగా కంటైన్మెంట్ జోన్లకే పరిమితం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా బస్సులు, రైల్వేలు, విమానాలను ఓపెన్ చేసి పరిమిత ప్రయాణాలు చేసేలా కార్యచరణ ఉండబోతుంది. దశల వారీగా దేశీయ విమాన ప్రయాణాలు కూడా మొదలుకాబోతున్నాయి.
పెద్ద సంఖ్యలో తయారీ రంగ పరిశ్రమలు, బిజినెస్, వివిద కార్యాలయాలు సహా అన్నీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆన్ లైన్ లో ఇప్పటి వరకు కేవలం నిత్యవసర సరుకులు మాత్రమే సరఫరా చేస్తుండగా… ఇక నుండి అన్నీరకాల సేవలను పునరుద్దరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.