లాక్ డౌన్ ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. లాక్ డౌన్ తో బయటకెళ్ళి పనిచేసేసుకునే వెసులుబాటు లేక…అనారోగ్యానికి గురైన తన కొడుకును బ్రతికించుకోలేని ఓ తండ్రి విషాద గాథ ఇది. సినిమా కథకు ఏమత్రం తీసిపోని తండ్రి వ్యధ ఇది. ఓ పదకొండేళ్ళ బాలుడు వైద్యానికి నోచుకోక రక్తం కక్కుకొని ప్రాణాలను వదిలిన విషాద ఘటన అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
చిత్తు కాగితాలు ఏరుకుంటూ కుటుంబాన్ని పోషించే మనోహర్ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు. అందులో దేవ పెద్దవాడు. అతనికి కొన్నిరోజుల నుంచి ఆరోగ్యం ఏమాత్రం బాగుండటంలేదు. దీంతో అనారోగ్యానికి గురైన దేవను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి అతని తల్లిదండ్రులు వైద్యం కోసం తీసుకెళ్ళారు. అతని పరీక్షించిన హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దేవను అనంతపురం సర్వజన ఆసుపత్రికిగాని ,కర్నులు ఆసుపత్రికిగాని తీసుకెళ్ళాలని సూచించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో బాలుడి తండ్రి కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమయ్యాడు. చేతిలో చిల్లిగవ్వ లేక పేదరికం అతని వెక్కిరించింది. కొడుకు ప్రాణాలను కాపాడుకోవాలనే ఆలోచన అయితే ఉంది కాని అతని పేదరికం దేవను ఆసుపత్రికి తీసుకేళ్ళెందుకు అవరోధంగా నిలిచింది. దాంతో దేవను అనంతపురం తీసుకెళ్లలేకపోయాడు. ఉనట్టుండి గురువారం దేవ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతని గోరంట్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. దేవ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో అక్కడే మృతి చెందాడు. తమ కొడుకు మృతి చెందాడని తెలుసుకొని తల్లిదండ్రులు ఆసుపత్రి ప్రాంగణంలో విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
దేవ మృతి చెందాక అతని మృతదేహాన్ని చేతులపై మోస్తూ తీసుకెళ్ళడం స్థానికులను కంటతడి పెట్టించింది. లాక్ డౌన్ తో చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతోన్న మనోహర్ అతని కొడుకు అంత్యక్రియలు చేయడం కుడా అసాధ్యమని స్థానికులు సహాయం చేయడంతో దేవ అంత్యక్రియలను పూర్తిచేశాడు. చిన్న గుడిసేలో నిలువ నీడ కూడా సరిగాలేని ఇటువంటి పేదల జీవితాలను కరోనా వలన వచ్చిన లాక్ డౌన్ విషాదభరితంగా మర్చిసేంది. మునుముందు లాక్ డౌన్ తో ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయో చూడాలి.
లాక్ డౌన్ తో సంపన్నులకు, మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఇబ్బందిగా లేకపోయిన మనోహర్ లాంటి వారి జీవితాలకు మాత్రం శాపంగా పరిణమిస్తుందనేది నగ్న సత్యం.