కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ఇండియా నడుం బిగించింది. దేశంలో 12 రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. మధ్య ప్రదేశ్4 రోజుల పాటు లాక్ డౌన్ చేయగా…. మిగితా రాష్ట్రాలు మార్చి 31 వరకు లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించాయి.
అయితే… కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు లాక్ డౌన్ నిర్ణయం మాత్రమే సరిపోదని, లాక్ డౌన్ సమయంలో ఆయా రాష్ట్రాల పరిధిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు మైక్ ర్యాన్ ప్రకటించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని, ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా… మళ్ళీ కరోనా వైరస్ పంజా విసురుతుంది అని హెచ్చరించారు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో కరోనా వైరస్ సామాన్య జనంలోకి వెళ్తే నివారించడం కష్టం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనితో అంతర్జాతీయ విమాన సేవలు సహా రైళ్లు, ప్రభుత్వ-ప్రైవేట్ బస్ లను ప్రభుత్వాలు నిషేదించాయి.