టీ తాగడం కోసం ఓ లోకో ఫైలెట్ ఏకంగా ట్రైన్ ను ఆపేశాడు. ఈ ఆసక్తికర ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. అయితే.. ఝాన్సీ నుంచి గ్వాలియర్ వెళ్లేందుకు మెయిల్ ఎక్స్ప్రెస్ ఉదయం 5: 27కు బయలుదేరింది. సివాన్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఉన్నఫలంగా ట్రైన్ ఆగిపోయింది. దీంతో ఛాయ్ కోసమని గార్డు ట్రైన్ దిగాడు.
ట్రైన్ బయలుదేరాల్సిన సమయం అవుతున్నప్పటికీ.. గార్డ్ ట్రైన్ ఎక్కలేదు. అది తెలుసుకున్న లోకో ఫైలెట్.. క్రాసింగ్ వద్దకు తీసుకెళ్లి నిలిపివేశాడు. ఏమైందని ప్రయాణికులు భయపడుతుండగానే గార్డు ఛాయ్ తీసుకువచ్చి.. లోకో ఫైలెట్ ఇచ్చాడు.
అతను టీ తాగిన తర్వాత ఆ ట్రైన్ నెమ్మదిగా బయలుదేరింది. దీంతో రైలులోని ప్రయాణికులతో పాటు.. రోడ్డుపై ఉన్న వాహనదారులు కూడా అవస్థలు పడ్డారు. అయితే.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
ఈ ఘటనపై స్పందించిన నెటిజన్లు.. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. దీనిపై పూర్తి విచారణ చేపడతామని చెప్తున్నారు. విచారణ అనంతరం తగుచర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు రైల్వే అధికారులు.