ఈ నెల 11 న జరిగిన కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడ్డ లోకో పైలెట్ చంద్రశేఖర్ మృతిచెందారు. నాంపల్లి కేర్ ఆసుపత్రిలో ఎనిమిది రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆఖరికి తుది శ్వాస విడిచినట్టు నాంపల్లి వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కేబిన్ లో ఇరుక్కున్న చంద్రశేఖర్ ను సుమారు 8 గంటలు పాటు శ్రమించి బయటకు తీశారు. అప్పటికే చంద్రశేఖర్ కుడి కాలులోని రక్తనాళాలు దెబ్బతినటంతో రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇన్‌ఫెక్షన్ శరీరం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉందని శస్త్రచికిత్స చేసి కుడి కాలును మోకాలు వరకు తొలగించారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చంద్రశేఖర్ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఎంఎంటీఎస్ రైలు హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి.