జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. భారత పార్లమెంట్ ఆయనకు ఈ రోజు నివాళులు అర్పించింది. పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.
సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. షింజో అబే మృతి పట్ల స్పీకర్ సంతాపం తెలియజేశారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు సంతాపం తెలిపారు.
ఈ నెల8న జపాన్ లోని నారా పట్టణంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి షింబో అబే హాజరయ్యారు. ఆ సమయంలో అబేపై దుండగుడు తుపాకీతో కాల్పులకు దిగాడు. అబేకు నివాళి అర్పించిన తర్వాత సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
మరోవైపు రాజ్యసభలోనూ అబేకు నివాళులు అర్పించారు. అబేకు నివాళి సందేశాన్ని చైర్మన్ వెంకయ్య నాయుడు చదివి వినిపించారు. భారత్, జపాన్ మధ్య బలమైన బంధాలు ఏర్పడటంలో షింజో కీలక పాత్ర పోషించాడన్నారు.