అనుకున్నట్టుగానే జరిగింది. పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ లో ప్రకటించిన దాని కన్నా ఒక రోజు ముందే సమావేశాలు ముగిశాయి.
సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైన వెంటనే సభను వాయిదా వేస్తూ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ప్రకటన చేశారు. కానీ రాజ్యసభలో మాత్రం చివరి రోజు కూడా రగడ కొనసాగింది. విపక్షాలు గురువారం కూడా ఆందోళన బాట పట్టాయి.
సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. వాయిదా ప్రకటన చేస్తున్న సమయంలో కాంగ్రెస్, శివసేన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బీజేపీ నేత కిరీటి సోమయ్య అక్రమ నిధుల మళ్లింపు విషయంపై చర్చ చేపట్టాలని శివసేన డిమాండ్ చేసింది. దానికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. దీంతో సభలో రభస జరిగింది.