నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీ
ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజే వైసీపీ ప్రభుత్వం దివ్యాంగురాలైన అవ్వని అవమానించడం విచారకరం. అనంతపురం జిల్లా, యాడికి మండలం, కత్తిమానుపల్లికి చెందిన పుల్లమ్మకి భూమి ఉందని సాకు చూపి పెన్షన్ కట్ చేసారు. అసలు తనకి భూమే లేదని మొర పెట్టుకున్నా కరుణించని అధికారులు.. జగనన్నకి మొక్కుకో అంటూ అవమానపర్చేలా మాట్లాడటం ఘోరం. తక్షణమే పుల్లమ్మ పింఛను పునరుద్ధరించాలి. పండుటాకుల ఆసరా తీసేసి ఏంటీ అరాచకం ముఖ్యమంత్రి జగన్.