నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
దిశ చట్టం అంటూ జగన్ బిగ్గరగా అరవడం.. వైసీపీ బ్యాండ్ బ్యాచ్ ఈలలు, కేకలు వేయడం తప్ప ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరిగింది లేదు. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం.. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇంకేమి రక్షణ కల్పిస్తారు..?
ముఖ్యమంత్రి ఇంటి పక్కన, సొంత నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే ఈరోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోవడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగన్ రెడ్డి దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఉపన్యాసం ఇస్తున్న సమయంలోనే.. గుంటూరులో దళిత యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు మృగాడు.
ఉన్నత విద్య అభ్యసిస్తూ బంగారు భవిష్యత్తు ఉన్న యువతి ప్రయాణం.. అర్దాంతరంగా ముగిసిపోవడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన. ఆ యువతిని హత్య చేసిన మృగాడికి కఠిన శిక్ష పడాలి.