నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీ
తిరుమల పవిత్రతను ఒక పక్కా ప్రణాళికతో దెబ్బతీస్తోంది వైసీపీ ప్రభుత్వం. వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మర్చేశారు జగన్. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులకు గురిచేశారు.
ఇప్పుడు ఏకంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు తనకి గది కేటాయించలేదు అంటూ టీటీడీ ఉద్యోగిని దుర్భాషలాడాడు. భౌతిక దాడి చేశాడు. టీటీడీ సీనియర్ అసిస్టెంట్ వెంకట రత్నంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
భక్తులకు, సిబ్బందికి రక్షణ కల్పించలేకపోవడం టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమే. సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
Advertisements
మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. సిబ్బిందికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?