టీడీపీ నేత నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ వారి కుమారుడు ట్విట్టర్‌లో పెట్టిన ఒక ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
గుంటూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు పార్టీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశాడు.