గుంటూరు: గతంలో ఎక్కువకు టెండర్ వేసి పనులు దక్కించుకున్న మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థకే మళ్లీ టెండర్ కట్టబెట్టారని, అవే పనులకు ఆ సంస్థ తక్కువగా బిడ్ వేసిందంటేనే మతలబు ఏమిటో అర్థమవుతోందని అంటున్నారు టీడీపీ నేత నారా లోకేశ్. పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారంపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేవలం 58 కోట్ల రూపాయలను మిగిల్చి చంకలు గుద్దుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మార్చిలో పనులు దక్కించుకుని ఒక్క శాతం పనులు కూడా పూర్తి చేయలేక చేతులెత్తేసిన సంస్థకు పనులు అప్పగించారని…. ఈ ప్రాజెక్టు ఇంకా ఎప్పటికీ పూర్తవుతుందో అంటూ ట్వీట్లో విమర్శించారు. సాక్షిలో వచ్చిన వ్యతిరేక కధనం తాలూకు అప్పటి పేపర్ క్లిప్పింగ్స్ కూడా జత చేశారు.
ఆలూలేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది వైసీపీ నేతల తీరు. గతంలో 4.77 శాతం ఎక్కువకు టెండర్ వేసి పనులు దక్కించుకున్న మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ.. తాజాగా అవే పనులకు 15.60 శాతం తక్కువకు బిడ్ వేసిందంటేనే మతలబు ఏమిటో అర్థమవుతోంది! pic.twitter.com/bhxh0fibuS
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 21, 2019
గతంలో ఇదే సంస్థకు పనులు అప్పగించినప్పుడు సంస్థ సామర్థ్యాన్ని ప్రశ్నించిన వైసీపీ.. ఇప్పుడు అదే సంస్థకు పనులు ఎలా అప్పగిస్తోంది? కేవలం రూ.58 కోట్లు మిగిల్చేశాం అని చంకలు గుద్దుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారా? అప్పుడు ఉట్టికి ఎగరలేనమ్మ ఇప్పుడు స్వర్గానికి ఎగిరేస్తుందా?
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 21, 2019