ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై.. ప్రతిపక్ష టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. కేటీఆర్ మాట్లాడిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. వైసీపీ పాలనపై సెటైర్లు వేశారు. ‘కేటీఆర్ నోట.. జగన్ విధ్వంసపాలన మాట.. అట్టుంటది ఒక్క చాన్స్ తోని..’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
మాదాపూర్ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభ సమయంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీలో సరిగా రోడ్లు లేవని , కరెంట్ లేదని ..నీళ్లు కూడా లేవని అన్నారు.హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. మరో 10 నుంచి 15 ఏళ్ల వరకూ హైదరాబాద్‌కు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మౌలిక సదుపాయాల పరంగా హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
అంతేకాదు ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమయ్యాయి ఇతర వసతులు లేవని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కొద్ది రోజుల క్రితం తన మిత్రుడు పండగకు ఏపీ వెళ్లివచ్చి.. అక్కడి పరిస్థితుల గురించి చెప్పారని వివరించారు.
రాష్ట్రంలో ఎవరికైనా అనుమానం ఉంటే ఒక్కసారి పక్క రాష్ట్రాలకు వెళ్లి పరిశీలించి రావొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ వైసీపీ పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోను టీడీపీ నేతలు తెగ వైరల్ చేస్తున్నారు.
కేటీఆర్ నోట…జగన్ విధ్వంసపాలన మాట..
అట్టుంటది ఒక్క చాన్స్ తోని.. pic.twitter.com/qWKF5ADJLj
— Lokesh Nara (@naralokesh) April 29, 2022
Advertisements