గుంటూరు : టీడీపీ అధినేత చంద్రబాబు, యువ నేత లోకేశ్.. ఇద్దరూ కూడా సంప్రదాయాలను పాటించడంలో ముందుంటారు. ప్రత్యర్ధులైనా సరే, పలకరించాల్సిన సందర్భాల్లో అస్సలు వెనుకాడరు. తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్‌కల్యాణ్‌కి ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించాలని కోరుతున్నట్టు లోకేష్ ట్వీట్ చేశారు.
‘జనసేన అధినేత శ్రీ పవన్‌కల్యాణ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఉన్నతమైన భావాలతో ప్రజాక్షేత్రంలో ప్రయాణిస్తున్న మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు.
ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘తెలుగు సినీ నటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించి, విశిష్ట వ్యక్తిత్వంతో ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తోన్న జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు శతాయుష్కులై, సంపూర్ణ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.