
ట్విట్టర్ లో మాజీ మంత్రి నారా లోకేష్
పాదయాత్రలో అర్హులు అందరికీ సంక్షేమకార్యక్రమాలు, అధికారంలోకి వచ్చాక ఆంక్షల పేరుతో కోతలు.
సామాన్యుడికి ఏంటీ కష్టాలు?
హామీల నుంచి పథకాలకు వచ్చేసరికే సగం మంది లబ్దిదారులను తీసేశారు.
వాళ్ళ నుంచి కూడా కొంతమందిని తీసేసే కుట్రతో రేషన్ కార్డులకు ఈకేవైసీ చేయించుకోవాలన్నారు.
పోనీ ఆ పనైనా సరైన ప్రణాళిక, అధికారుల పర్యవేక్షణతో చేస్తున్నారా అంటే అదీ లేదు.
పిల్లలు, మహిళలు 20 రోజులుగా ఎన్ని అవస్థలు పడుతున్నారో కనిపిస్తుందా?
మీ ప్రతి నిర్ణయమూ ప్రజలకు శాపంగా మారుతోంది
ఏర్పాట్లేవీ చేయకుండా రూల్స్ మార్చేసి ప్రజలను ఎందుకిలా శిక్షిస్తున్నారు?
కనీసం ఇప్పటినుంచైనా కాస్తంత చిత్తశుద్ధితో ప్రజల గురించి ఆలోచించండి.
వెంటనే నమోదు కేంద్రాలను పెంచి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి.