లోక్‌సభ ఎంపీ మోహన్ డెల్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని ఓ హోటల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. మోహన్‌ది పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్న.. ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపిన పోలీసులు.. నివేదిక వచ్చాకే వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు.
మోహన్ డెల్కర్ దాద్రా నగర్ హవేలీ నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో దాద్రా నగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీని వీడారు. ఆతర్వాత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. మోహన్ డెల్కర్ మొత్తంగా ఏడు సార్లు ఎంపీగా గెలుపొందారు. మోహన్ కుటుంబ సభ్యులు ఆయనది ఆత్మహత్య కాదని ఆరోపిస్తున్నారు.