కరోనా రక్కసితో మధ్యప్రదేశ్ కు చెందిన వనిశా పాఠక్ అనాథగా మారారు. సొంతింటి నిర్మాణం కోసం తండ్రి తీసుకున్న రూ. 29 లక్షల రుణం కట్టే బాధ్యత ఆమెపై పడింది. తీసుకున్న రుణాన్ని వెంటనే చెల్లించాలని ఆమెకు ఎల్ ఐసీ నోటీసులు పంపడం మొదలు పెట్టింది.
రుణాన్ని తిరిగి చెల్లించకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని బాలికను ఎల్ఐసీ హెచ్చరించింది. తన తండ్రి జితేంద్ర పాఠక్ పేరుమీద ఎల్ఐసీ పాలసీలు, కమిషన్లు ఉన్నాయని వనిశా ఎల్ఐసీకి తెలిపారు.
తాను ప్రస్తుతం మైనర్ ను అని మరో ఏడాది ఆగితే ఆ డబ్బులు తన చేతికి వస్తాయని, అప్పుడు ఆ అప్పును తానే తీరుస్తానని ఎల్ఐసీ ని ఆమె ప్రాధేయపడింది. కానీ ఆమె విజ్ఞప్తిని ఎల్ఐసీ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె పరిస్థితిపై మీడియాలో కథనాలు వచ్చాయి.
Advertisements
అవి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి వచ్చాయి. దీంతో బాలిక పరిస్థితిని చూసి కేంద్ర మంత్రి చలించి పోయారు. వనిశాకు సంబంధించిన వివరాలు తనకు అందించాలని ఎల్ఐసీని, ఆర్థిక సేవల విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మరో ఏడాది వరకు ఆమెకు నోటీసులు పంపకూడదన్న నిర్ణయానికి ఎల్ఐసీ వచ్చింది.