రోడ్డు పక్కన నిలుచున్న భార్య భర్తలపై లారీ దూసుకెళ్లిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాడు వద్ద జాతీయ రహదారి పై చోటుచేసుకుంది. అరటి లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కన నిలుచున్న వ్యక్తులపైకి దూసుకెళ్లింది. అక్కడికక్కడే ఉప్పలపాటి సూర్యకుమారి మృతి చెందగా, భర్త కు తీవ్ర గాయాలు కావటం పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.