హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భద్రాచలం డిపోకి చెందిన TS 28Z 0059 బస్ హైదరాబాదు నుండి భద్రాచలం వెళ్తుండగా… కామినేని హాస్పిటల్ దాటిన తర్వాత వెనుక నుంచి వస్తున్న లారీ Ap 07 Tf 8788 డీ కొట్టింది.
దీనితో బస్సు ప్రమాదానికి గురైంది. రోడ్డుకు ఓ వైపు ఒరిగింది. ఇక ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే బస్సు వెనక భాగం మాత్రం నుజ్జునుజ్జు అయింది.సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.