పీఆర్సీపై రెండు నెలలుగా చెప్పిందే సీఎస్ మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎస్ వివరణలో కొత్త విషయాలేమీ లేవన్నారు.పీఆర్సీకి, డీఏలకు ముడిపెడుతున్నరని అన్నారు.
డీఏలను కూడా కలిపి జీతాలు పెరుగుతున్నాయని.. అధికారులు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. పీఆర్సీని, డీఏలను కలిపి చూడొద్దని కోరారు. కరోనా కాలంలో కాలంలో ప్రాణాలకు తెగించి పని చేసిన ఉద్యోగుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. కొత్త పీఆర్సీ చట్టాన్నిరద్దు చేయాలని ఉద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే వారి కష్టాన్ని గాలికి వదిలేసి.. నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు.
ప్రభుత్వం ప్రటించిన 23 శాతం పీఆర్సీ వల్ల ఉద్యోగులకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగిలిన సంఘాలతో కలిసి వెళ్లటానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ఉమ్మడి వేదికగా కలిసి పోరాడేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. ఉద్యోగుల పట్ల మొండి వైకరి వీడి ఉద్యోగులకు అనుగుణంగా పీఆర్సీ అమలు చేయకుంటే రాష్ట్రంలో మరో ఉద్యమం లేవడం ఖాయం అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికీ ముంచుకపపోయింది ఏమీ లేదు.. పీఆర్సీని నూతన చట్టాన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వం తన మర్యాదను కాపాడుకోవాలని వెంకట్రామిరెడ్డి సూచించారు.