దేశంలోనే కాస్ట్ లీ దేవుడన్న పేరు. ప్రతి రోజు కోట్లలో హుండీ ఆదాయం. కానుకలు, బంగారు అభరణాలకు లెక్కే ఉండదు. ఇక బ్యాంకుల్లో టన్నుల కొద్ది బంగారు, వెండీ, వజ్రాల నిల్వలు. కానీ ఇప్పుడు స్వామివారి సేవలో పనిచేసే టీటీడీ ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు కూడా పైసల్లేవట.
కరోనా లాక్ డౌన్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల దర్శనం లేదు. దీంతో టీటీడీకి దాదాపు 400కోట్ల ఆదాయం ఆవిరైపోయిందట. ఇక ఈ ప్రభావం ఇప్పుడు జీతాలు, రోజు వారి ఖర్చులపై కూడా పడిందని టీటీడీ వర్గాల సమాచారం.
అయితే… టీటీడీ వద్ద ఉన్న బంగారు నిల్వలు, బ్యాంకు బ్యాలెన్స్ లో నుండి తీయకుండా ఉద్యోగులకు జీతాలిచ్చే అంశంపై ఆలోచన చేస్తున్నామని టీటీడీ అధికారులంటున్నారు.
ఇక ఈ కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక లోటుతో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వార్షిక బడ్జెట్ పై పడనుందని… అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.