తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుకు ఎవరి పాత్ర ఉందనే విషయం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. అసలు ఈ ఎపిసోడ్‌కు సూత్రదారులు ఎవరు? పాత్రదారులు ఎవరు? అనే అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది.
తాజాగా ఈ విషయంలో గవర్నర్ పై ఆరోపణలు వస్తుండటం దుమారం రేపుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రాజ్ భవన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు.
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రాజ్ భవన్ పై తప్పుడు ప్రచారాలు చేస్తుండటంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్దంగా అత్యున్నత స్థానం కలిగిన రాజ్ భవన్ పై ఇలాంటి ప్రచారాలు సరికావని ఆమె అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో రాజ్ భవన్ ప్రమేయం ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. నిరాధారమైన ఆరోపణలతో గవర్నర్ వ్యవస్థ, రాజ్ భవన్‌ను రాజకీయాల్లోకి లాగడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ప్రచారాలతో గవర్నర్ వ్యవస్థ, ప్రతిష్టను దెబ్బ తీయాలని చూడటం మంచిది కాదన్నారు.