బెంగళూరు నగరం అంతా మద్యాహ్నం 1.24గంటల వరకు ప్రశాంతంగా ఉంది. కానీ ఒక్కసారిగా మర్తాలీఈ, వైట్ ఫీల్డ్, సర్జాపూర్, ఎలక్ట్రానిక్ సిటీ, హెబ్బాల్ ప్రాంతాల్లో సడన్ గా భారీ శబ్ధాలు వచ్చాయి. ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్ధాలతో జనం అంతా భూకంపం వచ్చిందో బాంబు పేలుడో తెలియటం లేదంటూ తమకు తెలిసిన వారికి ఫోన్ చేయటం మొదలుపెట్టారు.
అయితే, భూకంపం ఏమీ లేదని… అది కేవలం పుకార్లేనని, రిక్టర్ స్కేల్ పై ఎలాంటి ప్రకంపనలు నమోదు కాలేదని కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు పర్యవేక్షణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ఆ భారీ శబ్ధాన్ని భారత వైమానిక దళం యొక్క సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ వల్ల వచ్చిందని తేలింది. మిరాజ్ 2000అనే విమానం వల్ల ఈ సోనిక్ బూమ్ వంటి శబ్ధం వచ్చిందని భావిస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి ఈ విమానాలు ఆయా ప్రదేశాల్లో గాల్లో ఏగిరాయని తేలింది.
ఈ సోనిక్ బూమ్ అంటే ఏంటి…?
సోనిక్ బూమ్ అంటే ఒక వస్తువు ధ్వని వేగం కంటే వేగంగా కదులుతున్నప్పుడు వాతావరణంలో వచ్చే విద్యుత్ తరంగాలతో సంభవించే ఒక ధ్వని. ఒక సూపర్ సోనిక్ జెట్ తన వేగాన్ని మరింత వేగవంతం చేసి, ధ్వని వేగాన్ని దాటినప్పుడు భారీ శబ్ధం వస్తుంది. దీన్నే సోనిక్ బూమ్ గా భావిస్తారు.
అయితే… ఈరోజు బెంగళూరులో వచ్చిన ఆ భారీ శబ్ధం మిరాజ్ విమానాలదేనా అనేది అధికారికంగా దృవీకరించాల్సి ఉంది.