యూపీలో పలు మసీదులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లౌడ్ స్పీకర్ల సౌండ్ ను తగ్గించుకున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు.
ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించినట్టు ఆయన వెల్లడించారు. అలా తొలిగించిన లౌడ్ స్పీకర్లను రాష్ట్రంలో పాఠశాలలకు డొనేట్ చేస్తున్నట్టు ఆయన వివరించారు.
పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఘర్షణలు జరిగాయని అన్నారు. కానీ యూపీలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోలేదన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాక శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి పండుగలను శాంతియుతంగా జరుపుకున్నారని చెప్పారు.
గతంలో రాష్ట్రంలో చిన్న విషయాలకే పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగేవన్నారు. పశువుల పేడ నుంచి సీఎన్ జీని తయారు చేసే విధానాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు పోతుందన్నారు.