సాగర్ కాలువలోకి దూకి బలవన్మరణానికి ప్రయత్నించింది ఓ ప్రేమ జంట. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. తాడు సాయంతో యువతిని పైకిలాగారు. యువకుడు నీటిప్రవాహానికి కాలువలో కట్టుకుపోయాడు.
ఈ ఘటన నల్గొండ జిల్లా హాలియాలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. యువకుడి కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పీఏపల్లికి చెందిన బాలకృష్ణ.. తన మరదలు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
కానీ.. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పెద్దలను ఎదురించలేక.. విడిపోయి బతకలేక చనిపోవాలని నిర్ణయించుకున్నారు. పీఏపల్లి నుంచి హాలియాకు వెళ్లే దారిలో ఉన్న సాగర్ కాలువలో ఇద్దరు కలిసి దూకారు. గమనించిన స్థానికుల యువతిని కాపాడినట్టు పోలీసులు వెల్లడించారు.
యువతిని తన తల్లిదండ్రులకు అప్పజెప్పి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు హాలియా ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు. బాలకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.