గబ్బా లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి యాషెస్ టెస్టులో ఓ ఆసక్తికర ఘటన కెమెరాకు చిక్కడం జరిగింది.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఒక యువ ఇంగ్లాండ్ క్రికెట్ అభిమాని మైదానం వెలుపల అందరి హృదయాలను గెలుచుకున్నాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, ఆ అబ్బాయి ఆస్ట్రేలియాకు చెందిన తన స్నేహితురాలికి మ్యాచ్ సందర్భంగా ప్రపోజ్ చేశాడు. దానికి అమ్మాయి ఓకే చెప్పడంతో అంతా శుభాకాంక్షలు తెలిపారు.
ఆ ప్రపోజల్‌ను అంగీకరించిన అమ్మాయి తన ప్రియుడిని కౌగిలించుకుంది. ఆ తర్వాత ఇద్దరు తమ ఉంగరాలు మార్చుకున్నారు. ఇక ఆ సమయంలో అక్కడున్న ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఇద్దరినీ అభినందించారు. అమ్మాయి పేరు నటాలీ ఇంకా అబ్బాయి పేరు రాబ్ అని పేర్కొనడం జరిగింది.
ఇక ఈ స్పెషల్ ప్రతిపాదనను గ్రౌండ్‌లోని పెద్ద స్క్రీన్‌పై వారు లైవ్ లో చూపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా యూజర్లు కూడా రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు. మ్యాచ్ సమయంలో ఓ మంచి ముహూర్తం ఉందంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు.
YES 🙌
Massive shoutout to Rob Hale, he met Natalie back in 2017 during the last #Ashes with the Barmy Army!
Congrats guys 🇦🇺🏴
pic.twitter.com/iZsLTxSGAi— England’s Barmy Army (@TheBarmyArmy) December 10, 2021
Advertisements