కుర్రకారు నాడిని పసిగట్టి దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలను తెరకెక్కిస్తుంటాడని అంటుంటారు. ఆయన చేసే సినిమాలు యువతకు బాగా కనెక్ట్ అవుతాయి. కనుక శేఖర్ కమ్ముల చేసే సినిమాలకు యూత్ లో బాగా క్రేజ్ ఉంటుంది. ఆయన దర్శత్వంలో తాజాగా ‘లవ్ స్టోరీ’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవిలు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాలెంటైన్ డే సందర్బంగా ‘ఏయ్ పిల్లా’ అనే సాంగ్ ప్రివ్యూను రిలీజ్ చేశారు. ఒక్క నిమిషం నిడివి గల ఈ సాంగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఓ సీన్‌లో మెట్రో ట్రైన్‌లో చైతూకు సాయి పల్లవి ముద్దు పెట్టగా, అతడు కన్నీరు పెట్టుకోవడం కనిపిస్తోంది. దాంతో ముద్దు పెడితే ఏడ్చేస్తారా అంటూ సాయి పల్లవి అడగటం భలే అనిపిస్తోంది. అంతేకాకుండా లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే నెలకొన్నాయి. అటు సాధారణ ప్రేక్షకులతోపాటు చైతు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎలా ఉండనుందోనని ఎదురుచూస్తున్నారు. సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
‘ఏయ్ పిల్లా’ సాంగ్ బాగుందంటూ సమంత తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది.
Musical Preview of #AyPilla is just❤❤… that last shot is going to be stuck in my head for a while @chay_akkineni ?❤️https://t.co/EkPP8ZqxaD#LoveStory .. the brilliant
@Sai_Pallavi92 ? @sekharkammula ? #PawanCH @AsianSunilN @SVCLLP #AmigosCreations @AdityaMusic #NC19 pic.twitter.com/1TreHJcylL— Samantha Akkineni (@Samanthaprabhu2) February 14, 2020