లవ్ స్టోరీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కానీ లేట్ గా రిలీజ్ అయిన విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసింది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ ని కూడా అదే స్థాయిలో రాబట్టింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల షేర్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.
ఇక నైజాం లో మూడున్నర కోట్లు రాబట్టిందట లవ్ స్టోరీ. దీనిని బట్టి ఈ చిత్రం సెన్సేషన్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా… పవన్ సంగీతం అందించారు. ఈ సినిమా అంతటి విజయం సాధించడానికి కారణం ముఖ్యంగా మ్యూజిక్ అనే చెప్పాలి.