శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రంమంచి వసూళ్లను సాధిస్తుంది. మొదటి రోజు 7.13 కోట్ల నికర వసూళ్లను సాధించిన ఈ మూవీ… రెండో రోజున రూ.5.08 కోట్లు, మూడో రోజున రూ.5.19 కలెక్షన్లు సాధించింది. అలాగే నాలుగో రోజున రూ.2.52 కోట్ల రూపాయల వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.19.92 కోట్లు నికరంగా… రూ.32 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
నైజాంలో రూ.1.28 కోట్లు
సీడెడ్‌లో 41 లక్షలు
ఉత్తరాంధ్రలో 23 లక్షలు
తూర్పు గోదావరి జిల్లాలో 10 లక్షలు
గుంటూరులో 11 లక్షలు
కృష్ణ జిల్లాలో 14 లక్షలు
నెల్లూరులో 10 లక్షలు వసూలు చేసింది.
నాలుగో రోజున రూ.2.52 కోట్ల నికర వసూళ్లు, రూ.4.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.