లవ్ స్టోరీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలాగే నాగ చైతన్య, సాయి పల్లవి నటన సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి మ్యూజిక్ ప్రధాన కారణమనే చెప్పాలి. పవన్ సీహెచ్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాపై అంచనాలను పెంచింది. అలాగే మంచి హైప్ ను కూడా తీసుకువచ్చింది. ముఖ్యంగా సారంగదరియా సాంగ్ హిట్ అయింది.
అయితే ఈ సినిమా సాధించిన విజయానికి గానూ చిత్ర యూనిట్ లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో ఈ మ్యాజికల్ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధులుగా నాగార్జున అక్కినేని మరియు ప్రముఖ దర్శకుడు సుకుమార్ హాజరు కానున్నారు.