శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్… సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సారంగదరియా సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా తాతయ్య .. మా నాన్న ఇద్దరూ కూడా సినిమాటోగ్రఫర్లుగా ఇండస్ట్రీలో పని చేశారు… కానీ నేను మ్యూజిక్ డైరెక్టర్ ను కావాలని అనుకునేవాడిని. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని మా తల్లిదండ్రులు సంగీతాన్ని నేర్పించారు. ఆ తరువాత నా టాలెంట్ ను గుర్తించి ఏఆర్ రెహ్మాన్ గారు ప్రోత్సహించారు. ఆయన టీమ్ లో కూడా కొంతకాలం పనిచేశానని అన్నారు.
Advertisements
అయితే ఎప్పటి నుంచో శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని అనుకున్నాను. అందుకే ఫిదా సినిమా సమయంలో ఆయనను కలిశాను. కానీ ఆయన అప్పుడు అవకాశం ఇవ్వలేదు. కానీ లవ్ స్టోరీ కోసం హే పిల్లా పాట చేసి వినిపించా…అది ఆయనకి నచ్చింది. ఆ తరువాత కూడా చాలా పరీక్షలు పెట్టారని అప్పుడు ఓకే చేశారని అన్నారు.