దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన సనిమా మగధీర. గత జన్మల కథాంశంగా రూపొందిన సోషియో ఫ్యాంటసి మూవీ. ప్రేమకోసం హీరో, హీరోయిన్లు మళ్ళీ జన్మిస్తారు.అయితే ఈ సినిమా పాయింటుని కామెడీ ట్రాక్ గా నటుడు ఆలీ, దివంగత నటుడు వేణుమాధవ్ లు ఓ సినిమాలోచేసారు.
అదేంటంటే గత జన్మలో ప్రేమికులైన వాళ్ళు ప్రస్తుత జన్మలో ఖర్మకొద్దీ..మగాళ్ళు గానే పుడతారు. వీళ్ళలో ఎవరో ఒకరు అమ్మాయిగా మారాలనుకుంటారు.కానీ చిన్న కమ్యూని కేషన్ గ్యాప్ వల్ల ఇద్దురూ ఆడవాళ్ళుగా మారిపోతారు.
అప్పట్లో ఈ కామెడీ ట్రాక్ ప్రేక్షకుల్ని బాగా అలరించింది. అయితే అలాంటి వింత ఘటన ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ఇద్దరమ్మాయిలు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని.. ప్రతిజ్ఞ చేసుకుని కొన్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం వారిలో ఓ అమ్మాయి..లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారింది.
అంత వరకూ బాగానే ఉంది. అయితే ప్రస్తుతం అమ్మాయిగా ఉన్న ఆమె, అబ్బాయిగా మారిన ఆమెతో కలిసుండనని ట్విస్ట్ ఇచ్చింది. అందేంటి నీ కోసం నేను సర్వం సిద్ధం చేసుకుని వస్తే ఇప్పుడు తొండాట ఆడుతున్నావేంటి ?అని వాపోయింది లింగమార్పిడి చేయుంచుకున్న మగామె. కోర్టును కూడా ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే..ఝాన్సీ జిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ శ్రీవాత్సవ అనే ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ జీవితాంతం కలిసుంటామని ప్రతిజ్ఞ చేసుకుని.. 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జీవించారు. కలిసి జీవించాలంటే ఇద్దరిలో ఒకరు మగవాడిగా ఉండాల్సిందేనని సోనాల్…సనా ఖాన్కు చెప్పింది.
దీంతో సనా ఖాన్ ఢిల్లీలో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పురుషుడిగా మారింది. తన పేరును కూడా సుహైల్ ఖాన్గా మార్చుకుంది. అయితే అదే సమయంలో సోనాల్ శ్రీవాత్సవకు ఓ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. అక్కడే ఆమెకు మరో అబ్బాయితో పరిచయం ఏర్పడి…అది కాస్త ప్రేమగా మారింది.
ఆ తర్వాత నుంచి సోనాల్..సనా ఖాన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. అయితే సనా తన ప్రియురాలిని ఎన్నిసార్లు ప్రాధేయపడినా సరే ఆమె హృదయం కరగలేదు లేదు,ఈమె దాహం తీరలేదు. కాగా, ‘నేను నీతో కలిసి జీవించలేను. అంత ఇబ్బందిగా ఉంటే వెళ్లి మళ్లీ అమ్మాయిగా మారు’ అని సోనాల్..సనాతో తెగేసి చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సనా ఖాన్ అలియాస్ సుహైల్ ఖాన్ కోర్టును ఆశ్రయించింది.
ఈ విషయంపై సనా ఖాన్ మే 30, 2022లో ఆన్లైన్ ద్వారా కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత జూన్ 3వ తేదీన కోర్టులో దావా వేసింది. సనాతో పాటుగా మరో ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేసుకుంది. ఆ తర్వాత ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ..కోర్టు సోనాల్కు నోటీసులు పంపింది.
అయితే సోనాల్ ఆ నోటీసులు స్వీకరించడానికి నిరాకరించింది. దీంతో కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. పోలీసులు జనవరి 18న సోనాల్ను అరెస్ట్ చేసి..జనవరి 19న తేదీన కోర్టులో హాజరుపరిచారు. కాగా, అదే రోజు సోనాల్కు బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరగనుంది.
ఇదిలా ఉండగా.. ఆ సర్జరీ కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేసినట్లు సనా ఖాన్ తెలిపింది. మళ్ళీ మళ్ళీ లింగమార్పిడి వీలుపడుతుందా?…కోర్టు ఈ కేసుని త్వరగా పరిష్కరిస్తుందా?, ఒకవేళ పరిష్కరించినా ఆమె, ఈమెతో కలిసి ఉంటుందా ? అనే విషయాలను నిలకడలేని ప్రమాణాలను నిజమని నమ్మి, సృష్టివిరుద్ధంగా మారిన సనాఖానే తేల్చుకోవాలి.