నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక సెప్టెంబర్ 24న అంటే రేపు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
మొత్తం ప్రపంచవ్యాప్తంగా 900 + థియేటర్లలో విడుదల కానుంది. అంతే కాదు… యూకేలో దాదాపు రెండేళ్ల తరువాత విడుదలవుతున్న మొదటి చిత్రం లవ్ స్టోరీ కావడం విశేషం. ఈ మేరకు మేకర్స్ థియేటర్స్ లిస్ట్ ను విడుదల చేశారు. అంతే కాదు…. ఈ మూవీ వకీల్ సాబ్ రికార్డు ను బ్రేక్ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో యూఎస్ఏ ప్రీ సేల్స్ ‘వకీల్ సాబ్’ $120K+. ఇక ఇప్పుడు యూఎస్ఏ ప్రీ సేల్స్ $150K+ సాధించి “లవ్ స్టోరీ ఆ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.