తెలుగుతెరపైకి సునామీలా విరుచుపడింది లవ్ టుడే సినిమా. ప్రస్తుతం ఈ సినిమా దెబ్బకు, మార్కెట్లో ఉన్న మూవీస్ అన్నీ సైలెంట్ అయ్యాయి. చివరికి సమంత నటించిన నటించిన యశోద సినిమా కూడా క్లోజింగ్ కు వచ్చిందంటే, దానికి కారణం లవ్ టుడే సినిమానే.
అలా తెలుగుతెరపై తన ప్రభంజనాన్ని చూపిస్తోంది తమిళ డబ్బింగ్ సినిమా లవ్ టుడే. దిల్ రాజు రిలీజ్ చేసిన ఈ మూవీ, విడుదలైన 3వ రోజుకే లాభాల్లోకి ఎంటరైంది. తాజాగా బయ్యర్లందరికీ భారీ లాభాలు ఆర్జించి పెడుతోంది.
ఆదివారం, సోమవారం అనే తేడా లేకుండా కుర్రకారు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో మార్నింగ్, మ్యాట్నీ షోలు కూడా హౌజ్ ఫుల్స్ నడుస్తున్నాయి.
ఫలితంగా ఈ సినిమా విడుదలైన 5 రోజుల్లోనే 9 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఖర్చులు, జీఎస్టీ పోను 4 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ చూపిస్తోంది. 3 కోట్ల రూపాయలు వస్తే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. అలాంటిది 5 రోజులుకే 4 కోట్ల 70 లక్షల రూపాయలు రాబట్టింది.
ఈ వీకెండ్ కూడా లవ్ టుడే హవా కొనసాగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తున్నప్పటికీ, ఈ సినిమా జోరు తగ్గేలా కనిపించడం లేదు.