విశాఖపట్నంలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపుతుంది. గోపాలపట్నంలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న మక్కా శిరీష, కంచరపాలెంకు చెందిన వెంకట్ లు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మాములుగా ఫోన్ లో మాట్లాడుకుంటుండగా చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. దీనితో మనస్తాపం చెందిన శిరీష గోపాలపట్నంలోని ఇంటి మేడ మీద గదిలో ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు లేని జీవితం వ్యర్థమంటూ కంచరపాలెంలో చెట్టుకు ఉరి వేసుకుని వెంకట్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇద్దరి మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.