కలిసి బ్రతకాలనుకున్న వారికి కులం అడ్డు గోడగా మారింది. కులాలు వేరన్న కారణంగా ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో… చావులోనైనా ఒక్కటవుదాం అనుకున్నారు. పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువలో ఈ విషాద ఘటన జరిగింది.
చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్-కేశబోయిన మహేశ్వరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. మనస్తాపానికి గురైన ప్రేమజంట మునగాల మండలం మొద్దుల చెరువు శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గురువారం సాయంత్రం ఇంట్లోని వచ్చిన ఇద్దరు ప్రేమికులు రాత్రి వేళలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, యువతి మైనర్ అని తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.