వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం కాముని పల్లిలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ వరుసకు అక్కా తమ్ముడు అయినా వారు ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు కుటుంబ సభ్యులు ఎక్కడ అడ్డు పడతారోనని గత కొన్ని రోజులుగా మనస్తాపంతో ఉంటున్నారు. కలిసి జీవించడానికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ఆ జంట కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే కాముని పల్లి గ్రామానికి చెందిన మమత డిగ్రీ చదువుతోంది. వరుసకు తమ్ముడైన ప్రశాంత్ తో కలిసి కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. వరుసకు అక్క తమ్ముడు కావడంతో వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని కలిసి చావడానికి నిర్ణయించుకున్నారు. వారి ఇళ్లల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు .ఇది గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .