పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. ఇది ఎవరికైనా ఒకటే. సెలబ్రిటీ అవని, పేద, మధ్యతరగతి వారవని ఎవరైనా అందరికీ వర్తిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువయ్యాయి. మాటలు కలవడమే ఆలస్యం ప్రేమించుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం ఇలా అన్ని అయిపోతున్నాయి.
అయితే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు స్క్రీన్ వెనుక ప్రేమించుకుని రియల్ లైఫ్ లో పెళ్లిళ్లు చేసుకున్నారు. అందులో కొంతమంది విడాకులు తీసుకొని విడిపోగా మరి కొంతమంది కలిసి ఉన్నారు. మొదటగా చెప్పుకోవాల్సింది సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల. అలాగే సూర్య, జ్యోతిక – సమంత నాగ చైతన్య కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు.
కృష్ణ, విజయనిర్మల ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. విజయనిర్మల చనిపోయే వరకు కూడా ఇద్దరూ కలిసి ఉన్నారు. బ్రతికున్నంత కాలం ఎంతో మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు.
భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ప్లాప్ గా నిలిచిన స్టార్ హీరోల సినిమాలు
శ్రీకాంత్ ఊహ… ఈ ఇద్దరూ కూడా హీరోహీరోయిన్స్ గా చేసిన వారే. అయితే ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. 1997లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరికి ముగ్గురు పిల్లలు, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు.
రాజశేఖర్ జీవిత… ఈ ఇద్దరు కూడా సినిమాలో నటిస్తున్న సమయంలో దగ్గరయ్యారు. మొదట స్నేహం కాస్త ప్రేమగా మారి 1991లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికీ ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
ఉదయ్ కిరణ్ తో నటించిన ఈ నటులు అంత చని పోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?
నాగార్జున అమల… మొదటి భార్య తో విడిపోయిన నాగార్జున అమల ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతకన్నా ముందు అమల నాలుగు సినిమాలకు పైగా నటించింది. వీరికి అఖిల్ పుట్టాడు.
ఇక హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు, వంశీ సినిమా సమయంలో మహేష్ నమ్రత లు కలిశారు. ఐదేళ్లు ప్రేమించుకుని ఎవ్వరికీ తెలియకుండా 2005లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార, ఇద్దరు పిల్లలు.
మరో జంట నాగచైతన్య సమంత… ఏం మాయ చేసావే సినిమాతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. 2017 లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కొన్ని కారణాలతో విడాకులు తీసుకుని విడిపోయారు.
మరో స్టార్ షాలిని అజిత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో అడుగుపెట్టిన షాలిని ని అజిత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకోగా ప్రస్తుతం వీరికి ఒక కొడుకు ఒక కూతురు.
మరో తమిళ హీరో సూర్య… అప్పట్లో సౌత్ లో మంచి పొజిషన్లో ఉన్న జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2006లో వీరి పెళ్లి జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.