ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలకు పలు హెచ్చరికలు పంపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
భారీగా ఏర్పడిన అల్పపీడనంతో అసాని తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయణిస్తూ ఇప్పటికే తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని అధికారులు స్పష్టం చేశారు.
మంగళవారం సాయంత్రానికి పశ్చిమ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.
ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 6 గంటల్లో తూర్పు బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో మత్య్సకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.