గ్రేటర్ హైదరాబాద్ లో ఎల్.ఆర్.ఎస్ అంశంతో కొత్త ఇంటి నిర్మాణ అనుమతులు నిలిచిపోయాయి. అయితే, ఎల్.ఆర్.ఎస్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో ఇంటి నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్.ఆర్.ఎస్ తోనే పర్మిషన్లు ముడిపెట్టింది.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్.ఆర్.ఎస్ కు అప్లై చేసుకొని ఉన్న అక్రమ లేఔట్లలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని, అయితే ఎల్.ఆర్.ఎస్ ఫీజును కూడా వసూలు చేయాలని నిర్ణయించింది. కానీ ఎల్.ఆర్.ఎస్ కు అప్లై చేసుకొని ప్లాట్లకు కూడా అనుమతులు ఇవ్వాలని నిర్ణయిస్తూనే… ఎల్.ఆర్.ఎస్ చార్జీలతో పాటు మరో 33శాతం కాంపౌండింగ్ ఫీజును కూడా వసూలు చేయనున్నారు. వీటికి 14శాతం ఓపెన్ స్పెస్ ఫీజును ఇప్పటి మార్కెట్ వాల్యూ ఆధారంగా అదనంగా వసూలు చేయనున్నారు.
ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బట్టి ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ ఫీజును ఏమాత్రం తగ్గించకుండా గతంలో నిర్ణయించిన రేట్లనే వసూలు చేయనుంది.